bcci: సీఓఏ ఛైర్మన్ కు ఎఫ్ఐఆర్ కాపీ పంపిన షమీ భార్య

  • న్యాయస్థానం బయట రాజీ చేసుకుంటానని పేర్కొన్న షమీ
  • రాజీ ప్రకటన తరువాత బీసీసీఐ విచారణ కమిటీ ముందు భార్యపై ఆరోపణలు
  • సీఓఏ ఛైర్మన్ కు ఎఫ్ఐఆర్ నకలు కాపీని పంపిన హసీన్ జహాన్

సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ కి కోల్ కతాలోని లాల్ బజార్ పోలీస్ స్టేషన్ లో తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌ పంపించింది. వివాహేతర సంబంధాలు, గృహహింస, హత్యాయత్న, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి నేరాలకు షమీ పాల్పడ్డాడంటూ హసీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనపై పలు సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీఓఏ షమీపై విచారణ ఆరంభించింది.

ఈ సందర్భంగా షమీ స్పందిస్తూ, తన భార్య తనను మోసం చేసింది, తన మొదటి వివాహం విషయం దాచిపెట్టిందని పేర్కొన్నాడు. తానెన్నడూ తప్పు చేయలేదని, చేసినట్టు రుజువైతే ఉరితీయాలని కోరాడు. ఈ నేపథ్యంలో హసీన్ తరపు లాయర్ షమీపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని సీఓఏ ఛైర్మన్ కు పంపారు. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగనుందో చూడాలి. భార్యతో కోర్టు వెలుపల సంధి చేసుకుంటానని ప్రకటించిన షమీ, ఆమెపై ఆరోపణలు చేయడంతో ఎఫ్ఐఆర్ ను సీఓఏ ఛైర్మన్ కు పంపినట్టు తెలుస్తోంది.

More Telugu News