Hyderabad: హైదరాబాద్ లో చిరుజల్లులు... రోడ్లపై జారిపడుతున్న వాహనాలు... కారణమిదే!

  • సిమెంట్ రోడ్లపై పేరుకుపోయిన పెట్రో వ్యర్థాలు
  • చిరు జల్లులతో జిగటగా మారిన వైనం
  • బైక్ లు స్కిడ్ అయి గాయపడుతున్న హైదరాబాదీలు

ఈ ఉదయం హైదరాబాద్ లో చిరు జల్లులు కురవగా, పలు ఫ్లయ్ ఓవర్లపై వాహనదారులు జారి పడుతూ ఉండటంతో, పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. చాలా రోజులుగా ఎండలు అధికంగా ఉండటం, ఆ సమయంలో వాహనాలు సిమెంట్ రోడ్డుపైకి విడిచిన పొగ కారణంగా కార్బన్ మోనాక్సైడ్ తదితర పెట్రో వ్యర్థాలు రోడ్లపై పేరుకుపోయాయి. భారీ వర్షం కాకుండా, చిరుజల్లులు కురవడంతో, ఆ దుమ్ము, ధూళి జిగటగా మారి రోడ్డుపై పరుచుకుంది.

ఈ విషయాన్ని గమనించని వాహనదారులు తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ తదితరాలపై దూసుకెళుతూ బ్రేకులు వేసిన సమయంలో స్కిడ్ అయి కిందపడిపోయారు. బైక్ లు అదుపు తప్పగా పలువురికి స్వల్పగాయాలు అయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు సిమెంట్ ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్ ను నిలిపివేశారు. సిమెంట్ వేసిన రోడ్లపై వాహనాలు నెమ్మదిగా కదిలేలా చూస్తూ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే పనిలో నిమగ్నమయ్యారు.

More Telugu News