Russia: రన్ వే పై కనకవర్షం... మూడు టన్నుల బంగారం నేల రాలింది!

  • రష్యాలోని యకుస్క్ ప్రాంతంలోని విమానాశ్రయంలో ఘటన
  • 9.3 టన్నుల బంగారు కడ్డీలను తీసుకెళ్తున్న విమానం
  • డోర్ తెరుచుకోవడంతో కింద పడిన 3.4 టన్నుల బంగారు కడ్డీలు

ఎయిర్ పోర్ట్ లోని రన్ వేపై కనక వర్షం కురవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాని వివరాల్లోకి వెళ్తే.. రష్యాలోని యకుస్క్‌ ప్రాంతంలో విమానాశ్రయం నుంచి నింబస్‌ ఎయిర్‌ లైన్స్ కు చెందిన ఆన్‌-12 కార్గో విమానం ఖరీదైన లోహాలతో క్రస్నోయాస్క్‌ బయల్దేరింది. విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానం డోర్ తెరుచుకుంది. దీంతో విమానంలో తరలిస్తున్న బంగారు కడ్డీలు ఆకాశం నుంచి వర్షంలా జారిపడ్డాయి.

సుమారు మూడు టన్నుల బరువుగల బంగారు కడ్డీలు విమానం నుంచి రన్ వేపై చెల్లాచెదురుగా పడ్డాయి. మొత్తం 172 కడ్డీలు పడ్డాయని, వాటి బరువు 3.4 టన్నులని అధికారులు ప్రకటించారు. విమానంలో మొత్తం 9.3 టన్నుల బంగారాన్ని తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని వారు తెలిపారు. విమానానికి ఉన్న డోర్ హ్యాండిల్ చెడిపోవడం వల్లే ఇలా జరిగిందని వారు తెలిపారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్టు నింబస్ ఎయిర్ లైన్స్ తెలిపింది. కాగా, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వారు తెలిపారు.
 

More Telugu News