Huawei Y9 (2018): నాలుగు కెమెరాలతో హువావే వై9 (2018) స్మార్ట్‌ఫోన్ విడుదల!

  • థాయ్‌లాండ్ మార్కెట్‌లో విడుదలైన హువావే వై9 (2018)
  • త్వరలో భారత మార్కెట్ లోకి
  • బ్లాక్, బ్లూ & గోల్డ్ కలర్ లలో లభ్యం

హువావే కంపెనీ నుంచి త్వరలో నూతన స్మార్ట్‌ఫోన్ 'వై9 (2018)' విడుదల కాబోతోంది. ఈ ఫోన్‌ వెనుక, ముందు భాగాలలో రెండేసి చొప్పున కెమెరాలు ఉన్నాయి. థాయ్‌లాండ్ మార్కెట్‌లో విడుదలైన ఈ ఫోన్‌ ప్రస్తుతం మూడు కలర్ (బ్లాక్ ,బ్లూ & గోల్డ్ ) లలో లభిస్తుంది. కాగా, 5.93" సైజ్ ఉన్న ఈ ఫోన్‌లో 4000ఎంఏహెచ్ బ్యాటరీ ని అమర్చారు.

హువావే వై9 (2018) స్పెసిఫికేషన్స్ :

  • ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సల్ ప్లస్ 2 మెగాపిక్సల్
  • బ్యాక్ కెమెరా: 16 మెగాపిక్సల్ ప్లస్ 2 మెగాపిక్సల్
  • 5.93" ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080x2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ (మెమొరీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు)
  • ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 4జీ వీవోఎల్‌టీఈ, నానో సిమ్-నానో సిమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
  • బ్లూటూత్ 4.0, వైఫై  
  • 4000ఎంఏహెచ్ బ్యాటరీ

More Telugu News