లోకేష్ కు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి: డొక్కా

15-03-2018 Thu 10:52
  • గబ్బర్ సింగ్ గురితప్పారు
  • పవన్ అపరిపక్వతతో మాట్లాడారు
  • టీడీపీపై ఆరోపణలు చేయడం సరికాదు

మంత్రి లోకేశ్ కు ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సిన సమయంలో టీడీపీపై అర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. పవన్ కల్యాణ్ రాజకీయ అపరిపక్వతతో మాట్లాడినట్లుగా అనిపించిందని ఆయన అన్నారు. జగన్ ఏ టీమ్ అయితే, పవన్ బీ టీమ్ అని ఆయన విమర్శించారు. జగన్ మాటలనే వల్లెవేస్తున్న గబ్బర్‌ సింగ్ గురితప్పాడని ఆయన వ్యాఖ్యానించారు.