Chandrababu: 'సాక్షి'లో వచ్చింది... పవన్ కల్యాణ్ చదివాడు: చంద్రబాబు

  • ఆరోపణల్లో ఎలాంటి వాస్తవమూ లేదు
  • కాపులకు రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరుగదు
  • పవన్ కు ఎంతో గౌరవం ఇచ్చాం
  • టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు

జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.  'సాక్షి' పత్రికలో గతంలో వచ్చిన అంశాలనే ఆయన ప్రస్తావించారని అన్నారు. వాటిల్లో ఎటువంటి వాస్తవమూ లేదని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును తెచ్చి చదివినట్టుందని, పవన్ కల్యాణ్ ను ముందు నిలబెట్టి ఎవరో కొత్త నాటకం ప్రారంభించారని చంద్రబాబు ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరుగకుండా చూస్తామని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని గుర్తు చేసిన ఆయన, టీడీపీ సర్కారు కులాల మధ్య చిచ్చు పెడుతోందని పవన్ విమర్శించడాన్ని తప్పుబట్టారు.

 ఉద్దానం కిడ్నీ వంటి ఎన్నో సమస్యలను పవన్ ప్రభుత్వం దృష్టికి తెచ్చిన వేళ ఆయనపై గౌరవాన్ని చూపి సానుకూలంగా స్పందించామని, వాటన్నింటినీ మరచిపోయిన పవన్, ఇప్పుడు ఎందుకిలా విమర్శిస్తున్నాడో తెలియడం లేదని అన్నారు. ఒక్కో చోట సభ పెడితే, ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుని ఆయన మాట్లాడుతున్నాడని ఆరోపించిన చంద్రబాబు, ఆయన విమర్శలు ఒక్కో సినిమాకు ఒక్కో రచయిత మాటలు రాసినట్టే ఉందని అభిప్రాయపడ్డారు. విషయం లేని విమర్శలు గుప్పించడం సరికాదని హితవు పలికారు.

More Telugu News