Hyderabad: సమయస్పూర్తితో వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించిన ఎంఎంటీఎస్ డ్రైవర్

  • కాచిగూడ రైల్వే స్టేషన్ లోని అన్నిఫ్లాట్ ఫాంలలో ఆగిఉన్న రైళ్లు
  • లింగంపల్లి నుంచి ఫలక్ నామా వెళ్లే రైలుకు దొరకని ఫ్లాట్ ఫాం
  • సిగ్నల్ ఇవ్వకపోవడంతో ట్రాక్ పై నిలిచిన రైలు
  • సీతాఫల్ మండి నుంచి విద్యానగర్ మీదుగా అదే ట్రాక్ పై దూసుకొచ్చిన మరో ఎంఎంటీఎస్ రైలు

సమయస్పూర్తితో వ్యవహరించి పెను ప్రమాదాన్ని ట్రైన్ డ్రైవర్ నివారించిన ఘటన కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... కాచిగూడ రైల్వే స్టేషన్ లో నాలుగు ఫ్లాట్ ఫాంలు ఉండగా, అన్ని ఫ్లాట్ ఫాంలపై రైళ్లు ఉన్నాయి. ఈ సమయంలో లింగంపల్లి నుంచి ఫలక్‌ నామా వెళ్లేందుకు ఎంఎంటీఎస్‌ రైలు విద్యానగర్‌ వైపు నుంచి వచ్చింది. ఈ ట్రైన్ కి స్టేషనులోని రెండో ప్లాట్‌ ఫాం వైపు సిగ్నల్‌ ఇస్తారు.ఆ సమయంలో ఆ ఫ్లాట్ ఫాంపై గుంటూరు ప్యాసింజర్‌ రైలు ఆగి ఉంది. ఇతర ఫ్లాట్ ఫాంలు ఖాళీ లేకపోవడంతో ఆ ఎంఎంటీఎస్‌ రైలును కాచిగూడ రైల్వే స్టేషను నుంచి విద్యానగర్‌ వైపు వెళ్లే ట్రాక్ పై నిలిపివేశారు. పది నిముషాల వ్యవధిలో మరో ఎంఎంటీఎస్‌ రైలు సీతాఫల్‌ మండి నుంచి విద్యానగర్‌ మీదుగా ఆ ట్రైన్ నిలిచిఉన్న ట్రాక్ పైకి దూసుకొచ్చింది. కొంచెం దూరంగా ట్రైన్ ఆగి ఉండడాన్ని గమనించిన ఎంఎంటీఎస్ డ్రైవర్ తన ట్రైన్ ను ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం ఆగింది. సిగ్నల్ లేదన్న కారణంతో ఆ ట్రైన్ అలాగే వెళ్లి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేది.

More Telugu News