పీఎన్బీ స్కాంతో ఆర్బీఐకి జ్ఞానోదయం...ఇకపై ఎల్ఓయూలు జారీ చేయరాదని బ్యాంకులకు ఆదేశం

- ఇకపై బ్యాంకులు ఎల్ఓయూలు/ఎల్ఓసీలు జారీ చేయరాదని ఆదేశం
- కొన్ని నిబంధనలకు లోబడి లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) జారీ, బ్యాంకు హామీలు కొనసాగుతాయని వెల్లడి
- నిబంధనల్లో మార్పులతో ఎల్ఓయూ ఆధారిత వ్యాపారలపై ప్రభావం
బ్యాంకుల రుణ వితరణ విధానాల్లో ఆర్బీఐ చేసిన తాజా మార్పులతో దిగుమతి ఆధారిత వ్యాపారాలతో పాటు బ్యాంకు హామీలను పొందేందుకు ఉద్దేశించిన ఎల్ఓయూలపై తరచూ ఆధారపడే వర్తకాలపై ప్రభావం పడే అవకాశముంది. కాగా, నీరవ్ మోదీ పీఎన్బీ నుంచి ఎల్ఓయూలను తీసుకోవడం మార్చి, 2011 నుంచి మొదలుపెట్టారు. ఎల్ఓయూలతో ఆయన సదరు బ్యాంకును దాదాపు రూ.13000 కోట్ల వరకు ముంచినట్లు దర్యాప్తు సంస్థల అధికారులు అంచనా వేశారు.