Suhana khan: మేగజైన్‌కు షారూఖ్ ఖాన్ బేటీ పోజులు..!

  • మేగజైన్‌కు పోజులిచ్చిన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ తనయ సుహానా
  • మేగజైన్ పేరు చెప్పేందుకు సుహానా తల్లి గౌరీ ఖాన్ నిరాకరణ
  • సుహానా త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందని ఊహాగానాలు

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలాకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయిదే అది నిజమా? కాదా? అనే విషయమై పలుమార్లు షారూఖ్-గౌరీ ఖాన్ దంపతుల వద్ద ప్రస్తావిస్తే...వారు సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటేసేవారు. కానీ, ముంబైలో ఇటీవల జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా గౌరీ ఖాన్ ఎట్టకేలకు ఓ విషయాన్ని స్పష్టం చేసింది. తమ బేటీ సుహానా ఓ మేగజైన్ కోసం షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపింది. అయితే ఆ మేగజైన్ పేరును మాత్రం ఆమె చెప్పకుండా సస్పెన్స్‌లో పడేసింది. తమ గారాల పట్టీ నటనపై గౌరీ ఖాన్ ఎంతగానో మురిసిపోతోంది. మేగజైన్‌తో మొదలుపెట్టిన సుహానా త్వరలోనే బాలీవుడ్‌లో ప్రవేశిస్తుందని అప్పుడే బీ-టౌన్ సర్కిళ్లలో ఊహాగానాలు మొదలైపోయాయి.

More Telugu News