Infosys: ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం... రెండు స్టాక్ ఎక్స్ఛేంజ్ ల నుంచి ఈక్విటీ వాటాల డీలిస్టింగ్

  • లండన్, పారిస్ మార్కెట్ల నుంచి డీలిస్టింగ్
  • సగటు వాల్యూములు తక్కువగా ఉండటమే
  • రెగ్యులేటరీ అధికారుల ఆమోదం కోసం ఎదురుచూపు
  • బీఎస్ఈకి వెల్లడించిన ఇన్ఫోసిస్

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రెండు దేశాల స్టాక్ ఎక్స్ఛేంజ్ ల నుంచి వైదొలగాలని సంచలన నిర్ణయం తీసుకుంది. రోజువారీ యావరేజ్ ట్రేడింగ్ వాల్యూముల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో పారిస్, లండన్ స్టాక్ మార్కెట్ల నుంచి ఇన్ఫీ ఈక్విటీ వాటాలను డీలిస్టింగ్ చేస్తున్నట్టు తెలియజేసింది. యూరో నెక్ట్స్‌ పారిస్, యూరో నెక్ట్స్‌ లండన్ ఎక్స్ఛేంజ్ ల నుంచి తమ ఏడీఆర్ అమెరికా డిపాజిటరీ రిసిప్ట్స్ ను డీలిస్ట్‌ చేయనున్నామని  ఒక ప్రకటనలో ఇన్ఫోసిస్ వెల్లడించింది. అయితే, మార్కెట్‌ రెగ్యులేటరీ అధికారుల నుంచి తమ నిర్ణయానికి ఆమోదం వచ్చేంతవరకు  క్యాపిటల్‌ స్ట్రక్చర్‌, లిస్టింగ్ కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు బీఎస్‌ఈ ఇండియాకు ఓ ప్రకటన విడుదల చేసిన ఇన్ఫోసిస్, ట్రేడింగ్ వాల్యూములు తక్కువగా ఉండటమే ఈ నిర్ణయానికి కారణమని తెలిపింది.

More Telugu News