Hyderabad: కూకట్ పల్లిలో ప్రకంపనల వదంతులు..పరుగులు తీసిన ఉద్యోగులు

  • మంజీరా ట్రినిటీ కార్పొరేట్ భవనంలో ప్రకంపనల పుకార్లు
  • కిందికి పరుగులు తీసిన 8,15,16 అంతస్థుల ఉద్యోగులు
  • ప్రకంపనలు లేవని సర్ది చెప్పిన సెక్యూరిటీ సిబ్బంది

హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ) కాలనీలోని బహుళ అంతస్థుల భవనంలో ప్రకంపనలు వచ్చాయంటూ రేగిన వదంతులు..ఆ భవనంలోని ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. కేపీహెచ్బీ కాలనీ జేఎన్టీయూ రోడ్డులోని మంజీరా ట్రినిటీ కార్పొరేట్‌ భవనంలోని ఎనిమిదో అంతస్తులో ప్రకంపనలు వచ్చాయంటూ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు భయభ్రాంతులకు గురై కిందికి పరుగులు తీశారు. ఈ వదంతులు 15, 16 అంతస్తుల్లోకి కూడా చేరడంతో వారు కూడా ప్రకంపనలు వచ్చాయంటూ పరుగులు తీశారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 18వ అంతస్థుతో పాటు ఇతర అంతస్థుల్లో పని చేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రకంపనలు పుకార్లని సర్ది చెప్పిన సెక్యూరిటీ సిబ్బంది. వారిని తిరిగి ఆయా అంతస్తులకు పంపారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు, ప్రకంపనలు పుకార్లని నిర్ధారించుకుని వెనుదిరిగారు.

More Telugu News