NTR: అప్పట్లో ఇది కేబీఆర్ పార్కు గోడ... నాగార్జున పోస్టు చేసిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఫోటో!

  • పాత చిత్రాన్ని పోస్టు చేసిన నాగార్జున
  • కారులో వెళుతున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్
  • వైరల్ అవుతున్న పిక్

అక్కినేని నాగార్జున పోస్టు చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. హైదరాబాద్, బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే మార్గంలో ఎప్పుడో తీసిన ఓ చిత్రంలోనిదీ దృశ్యం. ఏఎన్ఆర్ కారును డ్రైవ్ చేస్తుంటే, ఎన్టీఆర్ ఆయన పక్కన కూర్చుని వస్తున్నారు. "బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్" అంటూ... "ఇద్దరు లెజండ్స్ ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్... ఎడమవైపు కనిపిస్తున్నది కేబీఆర్ పార్కు గోడ. కుడివైపున్నది అన్నపూర్ణా స్టూడియోస్. ఈ రోడ్డుగుండా వెళితే, ఇప్పుడు జూబ్సీహిల్స్ చెక్ పోస్టు వస్తుంది. అయితే, అప్పుడున్నంత ప్రశాంతత మాత్రం ఉండదు" అని వ్యాఖ్యానించారు. నాగ్ షేర్ చేసిన ఆ పిక్ ను మీరూ చూడవచ్చు. కాగా, ఈ చిత్రం ఇద్దరు మహానటులూ నటించిన 'రామకృష్ణులు' చిత్రం షూటింగ్ సమయంలో తీసినది.

More Telugu News