Donald Trump: అమెరికా విదేశాంగ మంత్రి పదవి నుంచి టిల్లర్‌సన్‌ను తొల‌గించి, కొత్తవారిని నియమించిన ట్రంప్‌

  • విదేశాంగ మంత్రిగా మైక్ పాంపియోను నియ‌మిస్తున్నాం: ట్రంప్
  • ఇకపై సీఐఏ డైరెక్టర్‌‌గా గినా హాస్పెల్‌
  • సీఐఏ పదవికి ఎంపికైన తొలి మహిళ ఆమే

అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌స‌న్‌ను తొల‌గిస్తూ ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెక్స్ టిల్లర్‌సన్ స్థానంలో విదేశాంగ మంత్రిగా మైక్ పాంపియోను నియ‌మిస్తున్న‌ట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితమే ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాలని టిల్లర్‌స‌న్‌కు ట్రంప్ చెప్పారు. టిల్లర్ సన్ అందించిన సేవ‌ల‌కు థ్యాంక్స్ చెబుతున్నానని, ఆయన స్థానంలో వచ్చిన మైక్ పాంపియో ఆ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారని ట్రంప్ ట్వీట్ చేశారు. అంతకు ముందు మైక్ పాంపియో సీఐఏ డైరెక్టర్‌‌గా ఉన్నారు. ఇప్పుడు సీఐఏ డైరెక్టర్‌గా గినా హాస్పెల్‌ను నియమించారు. ఈ పదవికి ఎంపికైన తొలి మహిళ ఆమేనని ట్రంప్ చెప్పారు.   

More Telugu News