vikram kumar: విక్రమ్ కుమార్ తో నాని మూవీ లేనట్టే!

  • నానికి కథ వినిపించిన విక్రమ్ కుమార్ 
  • సెకండాఫ్ నచ్చలేదన్న నాని 
  • వేరే ప్రాజెక్టులతో విక్రమ్ కుమార్

తెలుగు తెరపై నాని జోరు ఒక రేంజ్ లో కొనసాగుతోంది. ఏ మాత్రం గ్యాప్ లేకుండగా ఆయన చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అలా ఆయన దర్శకుడు విక్రమ్ కుమార్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా అటకెక్కిందనేది తాజా సమాచారం.

అయితే విక్రమ్ కుమార్ వినిపించిన కథలో సెకండాఫ్ నచ్చకపోవడంతో నాని అసంతృప్తిని వ్యక్తం చేశాడనీ, ఫలితంగా ఆ ప్రాజెక్టు డౌట్లో పడిందనేది ఫిల్మ్ నగర్ టాక్. దాదాపు ఈ ప్రాజెక్టు లేనట్టేనని అంటున్నారు. ఎందుకంటే నాని వేరే కథలను సెట్ చేసుకున్నాడు. ఇక విక్రమ్ కుమార్ .. స్వప్న దత్ కి .. మంజుల ఘట్టమనేనికి వేరు వేరు కథలు వినిపించి ఓకే చేయించుకున్నారట. అందువలన ఈ రెండు ప్రాజెక్టులలో ఒకటి త్వరలో పట్టాలెక్కనుందని చెప్పుకుంటున్నారు.      

More Telugu News