Karthi chidambaram: బరువు తగ్గాలంటే సీబీఐ కస్టడీలో ఉంటే చాలు... కార్తీ చిదంబరం సెటైర్లు!

  • బరువు తగ్గాలంటే జిమ్‌కు వెళ్లాల్సిన పనిలేదు
  • సీబీఐ కస్టడీలో ఉన్నా లేదా సీబీఐ క్యాంటీన్ తిండి తిన్నా బరువు తగ్గిపోతారు
  • బరువు తగ్గాలనుకునే వారు సీబీఐకి ఫోన్ చేయండి
  • సీబీఐపై మీడియా సమక్షంలో కార్తీ చిదంబరం వ్యాఖ్యలు

ఓ అవినీతి కేసులో ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్న కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం సాక్షాత్తు కేంద్ర దర్యాప్తు సంస్థ 'సీబీఐ'పైనే సెటైర్లు వేశారు. బరువు తగ్గాలంటే జిమ్‌కి వెళ్లడం, కఠినమైన ఆహార నియమాలు పాటించడం అవసరం లేదని ఆయన అన్నారు. సీబీఐ కస్టడీలో ఉన్నా లేక ఆ సంస్థ క్యాంటీన్ తిండి తిన్నా ఆటోమేటిక్‌గా బరువు తగ్గిపోతారంటూ కార్తీ వ్యాఖ్యానించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కంపెనీ నుంచి ముడుపులు అందుకున్న కేసులో 12 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న ఆయన ఈ మేరకు అనుభవపూర్వకంగా సెటైర్లు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

"నాకు ఆకలి చచ్చిపోయింది. చాలా తక్కువ ఆహారం తింటున్నాను. అందువల్ల చాలా వరకు బరువు తగ్గిపోయాను. ఒకరకంగా ఇది మంచిది కూడా. నా పాత బట్టలన్నీ వదులైపోయాయి. ఇప్పుడు నాకు కొత్త బట్టలు కావాలి. ఎవరైనా బరువు తగ్గాలంటే సీబీఐకి కాల్ చేయండి" అని మీడియా సమక్షంలో నవ్వుతూ సీబీఐపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, 48 ఏళ్ల కార్తీని ఈ రోజు ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. అక్కడ ఈ నెల 24 వరకు ఆయన ఉంటారు.

More Telugu News