yoga in china: భారత్ ను చూసి నేర్చుకోవాలి... చైనా అధికారిక మీడియాలో కథనం

  • యోగాను విశ్వవ్యాప్తం చేసిన తీరుపై ప్రశంసలు
  • ఈ విషయంలో బాలీవుడ్ పాత్రకు మెచ్చుకోలు
  • చైనాలోని ఐదో శ్రేణి పట్టణాలకూ పాకిన యోగా క్రేజ్

తరచుగా భారత్ పై అక్కసు వెళ్లగక్కే, హెచ్చరికలతో కూడిన కథనాలను ప్రచురించే చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఈ సారి ఆకాశానికెత్తేసింది. అది కూడా యోగా విషయంలోనే. భారత్ తన సంస్కృతిని ఎంత తెలివిగా ప్రపంచానికి ఎగుమతి చేస్తుందో చూడండంటూ ఆ కథనంలో పేర్కొంది. చైనా ప్రభుత్వ సాయంతో విదేశాల్లో నడుస్తున్న కార్యక్రమాల కంటే కూడా, భారత్ తన యోగాను మరింత ఆమోదనీయంగా మార్చిన తీరును ప్రశంసించింది. దీన్ని చూసి చైనా నేర్చుకోవాలని షాంఘై ఇనిస్టిట్యూట్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ డైరెక్టర్ జాావో గాన్ చెంగ్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది. సాధారణంగా సామాజిక సందేశాత్మక చిత్రాలకు పరిమితమయ్యే బాలీవుడ్ సైతం యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో తమ వంతు పాత్రను పోషించినట్టు ఆ కథనంలో పేర్కొంది.

ఈ సందర్భంగా యోగా చైనాలో ఎలా విస్తరిస్తున్నదీ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గత రెండు సంవత్సరాల్లో చైనా పట్టణాల్లో యోగా క్లబ్ లు విస్తరిస్తున్న తీరును వర్షాల తర్వాత పుట్టగొడుగులు పుట్టుకొచ్చిన మాదిరిగా ఉన్నట్టు పేర్కొంది. కేవలం పెద్ద పట్టణాలకే పరిమితం కాకుండా, నాలుగు, ఐదో శ్రేణి పట్టణాల్లోనూ యోగాకు క్రేజ్ పెరుగుతుండడాన్ని తెలియజేసింది.

More Telugu News