nani: 'అ!' సినిమా దర్శకుడితో నాని .. ఈసారి హీరోగా!

  • 'అ!' సినిమాతో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ 
  • కొత్త కథతో నానిని ఒప్పించిన దర్శకుడు 
  • త్వరలోనే సెట్స్ పైకి ఈ ప్రాజెక్టు

హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతోన్న నాని, 'అ!' సినిమాతో నిర్మాతగానూ ప్రయోగం చేశాడు. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా, భారీ లాభాలనే తెచ్చిపెటింది. వైవిధ్యభరితమైన సినిమా అంటూ అందరితో అభినందనలు అందుకుంది.

దాంతో ప్రశాంత్ వర్మ టాలెంట్ పట్ల నమ్మకం కలగడంతో, తాను హీరోగా ఆయనతో సినిమా చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాకు వేరే అతను నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ప్రశాంత్ వర్మ వినిపించిన కథ కొత్తగా ఉండటం వలన .. తాను ఇంతవరకూ చేయని పాత్ర కావడం వలన, ఈ సినిమాను నాని ఒప్పుకున్నట్టుగా సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

More Telugu News