స్టార్ హీరో, స్టార్ కమెడియన్‌తో రాఘవేంద్రరావు తదుపరి చిత్రం...?

12-03-2018 Mon 11:30
  • మరో భక్తిరస చిత్రానికి దర్శకేంద్రుడి సన్నాహాలు..?
  • హీరో వెంకటేశ్, కమెడియన్ సునీల్‌లకు ఛాన్స్...
  • స్క్రిప్ట్ పనుల్లో డైరెక్టర్ నిమగ్నం
కె.రాఘవేంద్రరావు బీఏ...ఈ పేరు ఒకప్పుడు సక్సెస్‌ఫుల్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. కానీ చాలాకాలంగా ఆయన భక్తిరస చిత్రాల వైపు మళ్లిపోయారు. గంగోత్రి నుంచి ఓం నమో వేంకటేశాయ చిత్రం వరకు ఆయన వరుసగా భక్తిరస, ఆధ్యాత్మిక సంబంధమైన చిత్రాలనే తీస్తూ వస్తున్నారు. ఈ తరహా చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన సిద్ధహస్తుడు. తాజాగా ఇలాంటి ఓ సినిమానే రూపొందించాలని ఆయన అనుకుంటున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారని సమాచారం. ఇందులో ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్, స్టార్ కమెడియన్ సునీల్ నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త కొన్ని రోజులుగా వినబడుతోంది. వెంకీ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక సునీల్ కూడా హీరో పాత్రలతో పాటు కమెడియన్ పాత్రలతో బిజీబిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాఘవేంద్రరావు-వెంకీ-సునీల్ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది...ఇతర తారాగణం ఎవరు....ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాలు తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చెయ్యాల్సిందే.