android p: కొత్త ఫీచర్లతో వస్తున్న ఆండ్రాయిడ్ తదుపరి వెర్షన్ ‘పి’

  • ప్రస్తుతం డెవలపర్ వెర్షన్ లో ప్రివ్యూ విడుదల
  • మేలో అధికారికంగా ఆవిష్కరించే అవకాశం
  • యాపిల్ ఐఫోన్ ఎక్స్ మాదిరిగా ఫుల్ స్క్రీన్ కు సపోర్ట్

ఆండ్రాయిడ్ తదుపరి వెర్షన్ వచ్చేస్తోంది. ఆండ్రాయిడ్ పి పేరుతో డెవలపర్ ప్రివ్యూ వెర్షన్ లో ఇది విడుదలైంది. ఈ ఏడాది మే నెలలో గూగుల్ వార్షిక డెవలపర్ సదస్సులో దీన్ని ఆవిష్కరించే అవకాశముందని మార్కెట్ వర్గాల సమాచారం. ఆండ్రాయిడ్ పి వెర్షన్ ఫీచర్లన్నీ బయటకు రాలేదు. డెవలపర్లు అందించిన సమాచారం మేరకు... యాపిల్ ఐఫోన్ ఎక్స్ మాదిరిగా ఆండ్రాయిడ్ పి కూడా ఫుల్ స్క్రీన్లను సపోర్ట్ చేస్తుంది.

మెస్సేజ్ నోటిఫికేషన్ రాగానే వాటిని స్వైప్ డౌన్ చేసి ఇమేజ్ లను అటాచ్ చేసి ఉంటే వాటిని చూసుకునే వీలుంటుంది. హోమ్ స్క్రీన్ లోనే నోటిఫికేషన్ ట్రే నుంచి మెస్సేజ్ చూడడంతోపాటు రిప్లయ్ కూడా ఇవ్వొచ్చు. ఒక్కరికే కాదు గ్రూప్ మెస్సేజ్ కు కూడా వీలవుతుంది. మరింత డేటా, ఫోన్ లో స్పేస్ ఆదా కోసం ఇమేజ్ సైజును కంప్రెస్ చేసుకోవచ్చు. కంప్రెస్ చేసినా గానీ క్వాలిటీ తగ్గదు. ఇలాంటివే మరికొన్ని కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి.

More Telugu News