Simbaa: రణ్‌వీర్ సింగ్ సరసన ప్రియా ప్రకాశ్ వారియర్...?

  • రణ్‌వీర్ హీరోగా హిందీలో రూపొందుతున్న 'సింబా' చిత్రంలో ఛాన్స్?
  • హీరోయిన్ పాత్ర కోసం తొలుత ఆలియా, శ్రద్ధా కపూర్ పేర్ల పరిశీలన...!
  • డిసెంబరు 28న సినిమా రిలీజ్

వెరైటీ కనుగీటుతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌కు బాలీవుడ్‌ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. తెలుగులో జూనియర్ ఎన్‌టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' చిత్రాన్ని హిందీలో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా 'సింబా' పేరుతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నటించే ఛాన్స్ ప్రియా ప్రకాశ్‌కు వచ్చినట్లు తాజా సమాచారం. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం తొలుత ఆలియా భట్, శ్రద్ధా కపూర్ పేర్లు వినిపించినప్పటికీ, చివరకు ఆ అవకాశం ప్రియాని వరించినట్లు బీ-టౌన్ వర్గాలు చెబుతున్నాయి. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. డిసెంబరు 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ప్రియా నటించిన మలయాళ చిత్రం 'ఒరు అదార్ లవ్' ఈ జూన్‌లో విడుదలకానుంది.

More Telugu News