Arun Jaitly: జీఎస్‌టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

  • మూడు నెలల పాటు జీఎస్‌టీఆర్‌ 3బీ ఫైలింగ్‌ గడువు పొడిగింపు
  • ఎలక్ట్రానిక్‌-వే బిల్లు వచ్చేనెల 1 నుంచి దశలవారిగా అమల్లోకి
  • ఈ ఏడాది జూన్‌ 1 నాటికి దేశవ్యాప్తంగా ఈ-వే బిల్లు

ఢిల్లీలో ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో 26వ జీఎస్‌టీ మండలి సమావేశం జరిగింది. జీఎస్‌టీ రిటర్న్‌ల సరళీకరణపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ అంశంపై మరో సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. మూడు నెలల పాటు జీఎస్‌టీఆర్‌ 3బీ ఫైలింగ్‌ను పొడిగిస్తున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య రూ.50వేలకు మించి విలువ గల సరుకులు రవాణా చేయాలంటే ఉండాల్సిన ఈ-వే బిల్లుపై అరుణ్ జైట్లీ కీలక వివరాలు తెలిపారు.

తక్కువ ఆదాయాన్ని చూపిస్తూ పన్నుల ఎగవేత వంటి వాటికి పాల్పడుతోన్న ప్రక్రియను ఈ బిల్లు ద్వారా అరికట్టవచ్చని జైట్లీ చెప్పారు. ఎలక్ట్రానిక్‌-వే బిల్లును వచ్చేనెల 1 నుంచి దశలవారిగా అమల్లోకి తీసుకొస్తామని, ఈ ఏడాది జూన్‌ 1 నాటికి దేశవ్యాప్తంగా ఈ-వే బిల్లు అమల్లోకి వస్తుంది తెలిపారు.

More Telugu News