hands: నది ఒడ్డున బ్యాగు.. తెరచిచూస్తే 54 నరికిన చేతులు కనపడ్డ వైనం

  • రష్యాలోని సైబీరియా ప్రాంతంలో కలకలం
  • షాకైన పోలీసులు
  • దర్యాప్తు ప్రారంభం

ఓ నది ఒడ్డున అనుమానాస్పదంగా కనపడిన బ్యాగును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ బ్యాగును తెరచి చూడగా అందులో నరికిన 54 చేతులు కనపడడంతో షాకయ్యారు. ఈ ఘటన రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని ఖబరోవ్క్‌ నగరంలో ఉన్న నది ఒడ్డున చోటు చేసుకుంది.

ఈ బ్యాగును గుర్తించిన అముర్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ... తనకు ఆ బ్యాగులో ఓ చేయి కనపడిందని తెలిపాడు. దీంతో స్థానికులకు ఈ విషయం గురించి చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారని చెప్పాడు. బ్యాగులో ఇలా 54 చేతులు కనపడడంతో రష్యాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఈ వార్త సంచనలంగా మారింది. ఆ చేతులకు ఆసుపత్రిలో చుట్టే బ్యాండేజీలు, ప్లాస్టిక్‌ గ్లౌజులు కూడా చుట్టి ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

More Telugu News