Twitter: ట్విట్టర్ లో ఇకపై సామాన్యులకు కూడా 'బ్లూ టిక్ వెరిఫికేషన్'

  • గత ఏడాది రద్దు చేసిన బ్లూ టిక్ వెరిఫికేషన్
  • ఇపుడు యూజర్లందరికీ బ్లూ టిక్ మార్కు
  • ఎలా వెరిఫై చేయాలో స్పష్టత ఇవ్వని ట్విట్టర్

సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్ 'బ్లూ టిక్ వెరిఫికేషన్' ప్రక్రియను చేపడుతున్నట్లు ఆ సంస్థ సీఈవో జాక్‌ డోర్సే తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యంత నమ్మకమైన సర్వీసులను వినియోగదారులకు అందించి వారికీ తమపై ఉన్న విశ్వాసం మరింతగా పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు ఈ బ్లూటిక్ మార్కు కేవలం సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకు అలాగే ఇతర వీఐపీలకు మాత్రమే ఉండేది. గత ఏడాది నవంబర్ లో నిలిపివేసిన ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్ ఇపుడు ట్విట్టర్ వినియోగదారులందరికి అందించే యోచనలో ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. కాగా ఈ ధ్రువీకరణ ప్రక్రియ కోసం ఎలాంటి విధానం అనుసరించాలనేది మాత్రం ట్విట్టర్ తెలుపలేదు.

More Telugu News