Kodandaram: అందరూ ట్యాంక్ బండ్ కు రండి... ఏం జరుగుతుందో చూస్తా: కోదండరామ్ పిలుపు

  • అందరూ తరలిరండి
  • ప్రజా ఉద్యమాలను అణచివేస్తే తెలంగాణ వచ్చేదా?
  • కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదు
  • టీ జేఏసీ నేత కోదండరామ్

మధ్యాహ్నం సమయానికి మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను విజయవంతం చేసేందుకు లక్షలాదిగా విద్యార్థులు, జేఏసీ మద్దతుదారులు, ప్రజలు ట్యాంక్ బండ్ కు తరలిరావాలని, ఎవరు ఎలా అడ్డుకుంటారో చూద్దామని కోదండరామ్ పిలుపునిచ్చారు. కొద్దిసేపటి క్రితం తన ఇంట్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజా ఉద్యమాలను అణచివేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదన్నారు. పోలీసులను ఉపయోగించి కేసీఆర్ సర్కారు స్ఫూర్తి సభను అణచివేయాలని భావిస్తే, అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలకు ఎవరూ భయపడవద్దని ఆయన అన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోహరించిన పోలీసులు సుమారు 1700 మందిని అజ్ఞాతంలోకి తీసుకెళ్లారని, వారిలో ఎవరికి ఏమి జరిగినా, అందుకు కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పై ఉన్న మగ్దూం మొయినుద్దీన్ విగ్రహం వద్ద శాంతియుతంగా సభ నిర్వహించాలని తాము భావించామని, కానీ, కావాలనే టీఆర్ఎస్ సర్కారు ఉద్రిక్తతలను పెంచుతోందని కోదండరామ్ ఆరోపించారు.

More Telugu News