Krishnarjuna yudham teaser: నాని 'కృష్ణార్జున యుద్ధం' టీజర్ విడుదల!

  • రెండు విభిన్నమైన పాత్రలలో నాని
  • నాని సరసన రుక్సర్‌ మీర్‌, అనుపమా పరమేశ్వరన్‌
  • వేసవిలో ప్రేక్షకుల ముందుకు

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నేచుర‌ల్ స్టార్ నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా టీజర్ ని కొద్దిసేపటిక్రితం వదిలారు. 'యాడున్నార్రా గోపికలు' అంటూ టీజర్ లో నాని చెప్పే డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో నటించడంతో అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న నాని సరసన రుక్సర్‌ మీర్‌, అనుపమా పరమేశ్వరన్‌ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హిప్ హాప్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News