train tickets: మనం రద్దు చేసుకునే ట్రైన్ టికెట్ ను ఇకపై మరొకరికి బదిలీ చేసుకోవచ్చు!

  • ట్రైన్ టికెట్ ను బంధువులు లేదా తెలిసిన వారికి బదిలీ చేయొచ్చు
  • 24 గంటల ముందు స్టేషన్ మాస్టర్ అనుమతితో బదిలీ జరగాలి
  • కన్ఫర్మ్ అయిన టికెట్లకు మాత్రమే బదిలీ చేసుకునే వెసులుబాటు

ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ కష్టాలు తీరనున్నాయి. ట్రైన్ టికెట్‌ బుక్‌ చేసుకున్న తరువాత క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా బంధువులు లేదా తెలిసిన వారికి ఆ టికెట్ ను బదిలీ చేసుకునే సౌకర్యాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. కన్ఫర్మ్ అయిన టికెట్లకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నామని స్పష్టం చేసింది. ఒకరి టికెట్ ను మరొకరికి బదిలీ చేసేందుకు రైల్వే శాఖ అనుమతి తప్పని సరి అని పేర్కొంది.

టికెట్ ను బదిలీ చేసే అధికారం ముఖ్యమైన స్టేషన్లలోని చీఫ్‌ రిజర్వేషన్‌ పర్యవేక్షకులకు మాత్రమే కల్పిస్తున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ట్రైన్ బయల్దేరేందుకు 24 గంటల ముందు లిఖిత పూర్వక అనుమతి తీసుకుని టికెట్‌ ను బదిలీ చేయాలని వారికి సూచించింది. విద్యార్థులకు సంబంధించిన టికెట్‌ ను బదిలీ చేయాలనుకుంటే వారు చదివే విద్యా సంస్థ ప్రిన్సిపల్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపింది. ఒక టికెట్‌ ను ఒకసారి మత్రమే బదిలీ చేయాలని స్పష్టం చేసింది.  

More Telugu News