lion: అమ్మాయిని పట్టుకుని, దాడి చేయబోయిన సింహం.. మీరూ చూడండి!

  • ఓ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు సింహాలు, పులులు
  • ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి సింహంతో చెలగాటాలాడిన పిల్లలు
  • విసుగెత్తిపోయిన సింహం
  • సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఘటన

ఓ ఫెస్టివల్‌లో సింహాలు, పులులను ప్రదర్శనకు పెట్టడంతో పిల్లలు వాటిని చూసి ముచ్చట పడ్డారు. ఓ సింహం ఎన్‌క్లోజర్‌లో ఉండగా, దాని ట్రైనర్ సాయంతో పిల్లలు కూడా ఆ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి దగ్గర నుంచి సింహాన్ని చూశారు. అంతటితో ఆగకుండా ఆ సింహంతో చెలగాటాలాడారు. దాని వైపునకు రెండు చేతులూ చూపిస్తూ, అది ఏమీ చేయలేదన్నట్లుగా దానితో ఆడుకున్నారు. దీంతో విసుగెత్తిపోయిన సింహం ఓ అమ్మాయిని పట్టుకుని, దాడి చేయబోయింది.

దీంతో, అక్కడున్న పిల్లలంతా భయంతో వణికిపోయి కేకలు వేశారు. వెంటనే ట్రైనర్ ఆ సింహాన్ని పక్కకు లాగడంతో ప్రమాదం తప్పింది. ఆ పిల్లలను ఎన్‌క్లోజర్‌లోకి పంపిన ట్రైనర్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మీరూ చూడండి..     

More Telugu News