MS Dhoni: ధోనీ హెల్మెట్ పై జాతీయ జెండా చిహ్నం ఉండకపోవడానికి కారణం ఇదే!

  • కీపర్ గా కూడా బాధ్యతలను నిర్వహిస్తున్న ధోనీ
  • కొన్ని సందర్భాల్లో హెల్మెట్ కింద పెట్టాల్సి వస్తుంది
  • జెండా ఉన్న హెల్మెట్ ను కింద పెట్టడం తప్పు

తమ హెల్మెట్లపై జాతీయ జెండా చిహ్నాన్ని ఉంచుకోవడం టీమిండియా ఆటగాళ్లందరికీ ఉన్న అలవాటు. సచిన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ జాతీయ జెండా చిహ్నాన్ని హెల్మెట్ పై ఉంచుకున్నవారే. జాతీయ జెండా నుంచి తాను ఎంతో స్పూర్తి పొందుతానని ఒకానొక సందర్భంలో సచిన్ స్వయంగా చెప్పాడు. కానీ, 14 ఏళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ హెల్మెట్ పై మాత్రం జాతీయ జెండా చిహ్నం కనిపించదు.

దీనికి ఒక మంచి కారణం ఉంది. ధోనీ కీపర్ గా కూడా బాధ్యతలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కీపింగ్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో హెల్మెట్ ను కింద పెట్టాల్సి వస్తుంది. రాజ్యాంగం ప్రకారం జాతీయ జెండాను కింద పెట్టడం పెద్ద తప్పు. నేరం కూడా. ఈ నేపథ్యంలో, హెల్మెట్ ను కింద పెట్టాలంటే, దానిపై జాతీయ జెండా చిహ్నం ఉండకూడదు. ఈ కారణం వల్లే ధోనీ తన హెల్మెట్ పై జెండాను ఉంచుకోడు.

More Telugu News