nithin: 'శ్రీనివాస కల్యాణం' కోసం భారీ ఇంటి సెట్

  • దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కల్యాణం'
  • దర్శకుడిగా సతీశ్ వేగేశ్న 
  • నితిన్ సరసన రాశి ఖన్నా 

దిల్ రాజు నిర్మాణంలో .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన 'శతమానం భవతి' ఫ్యామిలీ ఆడియన్స్ తో శభాష్ అనిపించుకుంది. దాంతో అదే దర్శకుడితో ఆ తరహా కథాంశంతోనే సినిమా చేయడానికి దిల్ రాజు రంగంలోకి దిగారు. ఈ సినిమాకి 'శ్రీనివాస కల్యాణం' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

నితిన్ .. రాశి ఖన్నా నాయకా నాయికలుగా నటిస్తున్నారు. రెండు కుటుంబాలు .. ఒక వివాహ బంధం చుట్టూనే ఈ కథ తిరుగుతుందట. ఆ కుటుంబాలకి సంబంధించిన భారీ ఇంటి సెట్స్ ను రాజమండ్రి సమీపంలో వేయించారు. ఈ ఇళ్లు 'కూనవరం'లో వున్నట్టుగా కథ కొనసాగుతుంది. ప్రధాన పాత్రధారులంతా పాల్గొనగా, దాదాపు నెల రోజుల పాటు ఇక్కడ పెళ్లికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.      

More Telugu News