Supreme Court: నయం కాని వ్యాధులతో బాధపడుతూ.. స్వచ్ఛంద మరణాన్ని కోరుకునే వారికి ఆ హక్కును కల్పిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

  • స్వచ్ఛంద మరణానికి సుప్రీం అనుమతి
  • కేంద్ర విధివిధానాలకు ఓకే
  • గౌరవంగా మరణించే హక్కు ఉంటుంది
  • బతికేందుకు మార్గం లేదని తేలితేనే
  • ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు

విధిలేని పరిస్థితుల్లో గత్యంతరం లేక మరణించాలని భావించే వారికి వారు కోరిన అవకాశాన్ని దగ్గర చేయాలని సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. స్వచ్ఛంద మరణం (యూతనేషియా)పై దాఖలైన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం అందుకు అనుమతించింది. ఇప్పటికే స్వచ్ఛంద మరణంపై నియమ నిబంధనలను తయారు చేసిన కేంద్రం దాన్ని కోర్టుకు అందించగా, విచారించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం, కొద్దిసేపటి క్రితం తీర్పును వెలువరించింది.

బతికేందుకు ఎటువంటి మార్గమూ లేదని అన్ని విధాలుగా తేలిపోయిన తరువాత, స్వచ్ఛంద మరణాన్ని కోరుకునే హక్కు న్యాయమైన హక్కేనని పరిగణిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. పౌరులకు గౌరవంగా మరణించే హక్కు ఉందని అభిప్రాయపడ్డ న్యాయమూర్తులు, విధివిధానాలకు తగ్గట్టుగా వారు తమ కోరికను తీర్చుకోవచ్చని స్పష్టం చేశారు. ఎప్పటికీ నయం కాని వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఈ లోకాన్ని త్వరగా విడిచి వెళ్లాలని భావించడం తప్పేమీ కాదని కూడా న్యాయమూర్తులు తమ తీర్పులో వెల్లడించడం గమనార్హం.

More Telugu News