KCR: కేసీఆర్ ప్రధాని కావాలంటూ అజ్మీర్ దర్గాలో ప్రార్థనలు!

  • అజ్మీర్ వెళ్లిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
  • ఆయన వెంట వెళ్లిన మైనార్టీ నేతలు
  • అజ్మీర్ కలెక్టర్ తో కూడా భేటీ కానున్న నేతలు

దేశ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమూల మార్పులకు నాంది పలకాలని, దేశ ప్రధానిగా బాధ్యతలను చేపట్టాలని కోరుతూ రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాలో నేడు ప్రార్థనలను నిర్వహించనున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నేతృత్వంలో రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ మహ్మద్ మసీఉల్లా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, టీఆర్ఎస్ మైనార్టీ నేత షరీఫ్ తదితరులతో కూడిన బృందం నిన్న రాజస్థాన్ కు వెళ్లింది. ఈరోజు తొలుత... అజ్మీర్ కలెక్టర్ తో వీరు సమావేశమవుతారు. తెలంగాణ నుంచి అజ్మీర్ కు వెళ్లే భక్తుల కోసం అక్కడ గెస్ట్ హౌస్ ను నిర్మించడానికి అవసరమైన స్థలంపై కలెక్టర్ తో చర్చిస్తారు. అనంతరం దర్గా దివాన్ ను కలిసి, ప్రార్థనలను నిర్వహిస్తారు.

More Telugu News