gold: ఈ రోజు రూ.220 తగ్గిన బంగారం ధర!

  • నగల వ్యాపారుల నుంచి తగ్గిన డిమాండ్
  • 10 గ్రాముల పసిడి ధర రూ.31,450గా నమోదు
  • కిలో వెండి ధర రూ.400 తగ్గి, రూ.39,500గా నమోదు

ఈ రోజు బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి, రూ.31,450గా నమోదైంది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర దిగొచ్చింది. మరోవైపు వెండి ధర కూడా పడిపోయింది. కిలో వెండి ధర ఈ రోజు రూ. 400 తగ్గి, రూ. 39,500గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పడిపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. న్యూయార్క్‌లో పసిడి ధర 0.70శాతం తగ్గి, ఔన్సు ధర 1,324.90డాలర్లుగా నమోదైంది.  

More Telugu News