vijay devarakonda: విజయ్ దేవరకొండ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

  • తమిళ మూవీలో విజయ్ దేవరకొండ 
  • 'నోటా' అనే టైటిల్ ఖరారు 
  • కథానాయికగా మెహ్రీన్

తెలుగులో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఓ రెండు సినిమాలు విడుదలకి ముస్తాబవుతున్నాయి. తమిళంలోను ఆయన ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.

 జ్ఞానవేల్ రాజా సమర్పిస్తోన్న ఈ సినిమాకి 'నోటా' (NOTA) అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎన్నికల పరిభాషలో 'నోటా' అంటే .. 'ఈవీఎం'లో సూచించిన అభ్యర్థులనెవరినీ నేను ఎన్నుకోవడం లేదంటూ ఓటర్ తన అభిప్రాయాన్ని తెలియజేయడం. విజయ్ దేవరకొండ ఇంతవరకూ చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఆయన జోడీగా మెహ్రీన్ నటిస్తుందనే సంగతి తెలిసిందే.      

More Telugu News