raviteja: 'నేల టికెట్' కోసం యాక్షన్ లోకి దిగుతోన్న రవితేజ

  • రవితేజ హీరోగా 'నేల టికెట్'
  • రేపటి నుంచి తాజా షెడ్యూల్ 
  • కథానాయికగా మాళవిక శర్మ

రవితేజ సినిమాల్లో కథా కథనాలు పరుగులు తీస్తాయి .. సాంగులు సందడి చేస్తాయి .. ఫైట్లు ఔరా అనిపిస్తాయి. ఈ అంశాలను కలుపుకునే దర్శకుడు కల్యాణ్ కృష్ణ 'నేల టికెట్' కథను రెడీ చేసుకున్నాడు .. చకచకా ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన మాళవిక శర్మ నటిస్తోంది.

ఈ సినిమా తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. రేపటి నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ ఈ యాక్షన్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా శాటిలైట్ హక్కులు 25 కోట్లకి అమ్ముడైన సంగతి తెలిసిందే.  

More Telugu News