south africa: వార్నర్ కి 75 శాతం, డీకాక్ కి 25 శాతం మ్యాచ్ ఫీజు కోత

  • తొలి టెస్టులో హద్దులు మీరిన స్లెడ్జింగ్
  • వార్నర్ కి 75 శాతం మ్యాచ్ ఫీజు కోత
  • లియాన్ కి 50 శాతం మ్యాచ్ ఫీజు కోత
  • డీకాక్ కి 25 శాతం మ్యాచ్ ఫీజు కోత

ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టు పెను వివాదం రేపిన సంగతి తెలిసిందే. తొలుత మార్ క్రమ్ కొట్టిన బంతిని వార్నర్ ఆపడంతో రన్ కు రావద్దని వారించాడు. దీంతో వెనుదిరిగిన డివిలియర్స్ ను లియాన్ స్టంప్ అవుట్ చేశాడు. ఆ ఆనందంలో లియాన్ బంతిని డివిలియర్స్ గుండెలపై పడేశాడు. దీంతో వివాదం రేగింది.

ఆ తరువాత స్లెడ్జింగ్ హద్దులు మీరడంతో మూడో రోజు ఆటముగిసిన తరువాత డ్రెస్సింగ్ రూంకి వెళ్లే క్రమంలో డేవిడ్ వార్నర్, క్వింటన్ డీకాక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వార్నర్ దూకుడుగా డీకాక్ దగ్గరకు దూసుకెళ్లే ప్రయత్నం చేయడం, అతనిని స్మిత్ డ్రెస్సింగ్ రూంలోకి తీసుకెళ్లడం జరిగాయి.

 ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దీంతో విచారించిన ఐసీసీ చర్యలు తీసుకుంది. తొలుత నాధన్ లియాన్ ను విచారించిన రిఫరీ, తప్పుని అంగీకరించి క్షమాపణలు కోరడంతో 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా విధించారు. తరువాత డేవిడ్ వార్నర్ ను విచారించిన రిఫరీ, వార్నర్ కూడా తప్పును అంగీకరించడంతో మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా విధించి, మూడు డీ మెరిట్ పాయింట్లు అతని ఖాతాలో వేశారు. నాలుగు డీ మెరిట్ పాయింట్లు ఖాతాలో చేరితే ఒక టెస్టు నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ డీకాక్ కు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించి, అతని ఖాతాలో ఒక డీ మెరిట్ పాయింట్ ను వేశారు. 

More Telugu News