amala paul: అమలా పాల్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి ఫస్టులుక్

  • అమలా పాల్ ప్రధాన పాత్రలో తమిళ మూవీ
  • అడవి నేపథ్యంలో కొనసాగే కథ
  • ఈ సినిమా కోసం డిఫరెంట్ లుక్

తమిళంలో నయనతార, త్రిష కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ తరహా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ వాళ్ల క్రేజ్ ను మరింతగా పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ల దారిలో నడవడానికే అమలాపాల్ నిర్ణయించుకున్నట్టుగా 'అధో అంధ పారవై పోల' పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అమలా పాల్ ప్రధానమైన పాత్రను పోషిస్తోంది.

'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దట్టమైన అడవుల్లో తప్పిపోయిన ఓ మహిళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఆమె ఎలా అధిగమించింది? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా కొనసాగుతుందట. ఇంతవరకూ సుకుమారమైన పాత్రలనే చేస్తూ వచ్చిన అమలాపాల్, ఈ సినిమాలో రఫ్ అండ్ టఫ్ లుక్ తో కనిపిస్తుందని అంటున్నారు. ఈ సినిమా తనక్రేజ్ ను మరింతగా పెంచుతుందనే నమ్మకంతో అమలా పాల్ ఉందట.     

More Telugu News