nani: 'కృష్ణార్జున యుద్ధం' టీజర్ రిలీజ్ డేట్

  • ద్విపాత్రాభినయంతో నాని 
  • మార్చి 10వ తేదీన టీజర్ రిలీజ్ 
  • ఏప్రిల్లో భారీస్థాయిలో సినిమా విడుదల

మేర్లపాక గాంధీ పేరు వినగానే 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ' .. 'ఎక్స్ ప్రెస్ రాజా' వంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈ రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తన తాజా చిత్రంగా 'కృష్ణార్జున యుద్ధం'ను చేశాడు. మాస్ లుక్ తోను .. క్లాస్ లుక్ తోను ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రలను చేయడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ రెండు పాత్రల సరసన అనుపమ పరమేశ్వరన్ .. రుక్సార్ మీర్ నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మార్చి 10వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ టీజర్ ను వదలనున్నారు. ఈ సినిమాకి హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందించాడు. ఇటీవల రిలీజ్ చేసిన రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది. ఏప్రిల్ లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.   

More Telugu News