Jagan: ఏ పార్టీ అయినా నాకు అభ్యంతరం లేదప్పా... సంతకం పెట్టు ఇస్తా: జగన్

  1. ఏ పార్టీ అధికారంలో ఉంటుందన్నది నాకు ముఖ్యం కాదు
  2. హోదా, విభజన హామీలను నెరవేర్చాల్సిందే
  3. హోదాపై సంతకం పెట్టిన ఎవరికైనా మద్దతిస్తా

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందన్న విషయం తనకు ముఖ్యం కాదని, విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన హామీలనూ అమలు జరపాలన్నదే తన డిమాండని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. "మా ఆప్షన్స్ అన్నీ ఓపెన్ గానే ఉంటాయి. ప్రత్యేక హోదాపై సంతకం పెడితే మద్దతిస్తాం. ఏ పార్టీ అయినా నాకు అభ్యంతరం లేదప్పా. సంతకం పెట్టు ఇస్తా... నాకు కావాల్సినది ప్రత్యేక హోదా. ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరగాల. ప్రత్యేక హోదాపై ఎవడు సంతకం పెడితే వాడికి మద్దతిస్తా. (ఈ సమయంలో ఓ విలేకరి తొలి ఫైల్ ప్రత్యేక హోదాదే ఉండాలా? అని ప్రశ్నించగా) అది ఫస్ట్ ఫైలా? సెకండ్ ఫైలా అన్నది వేరే విషయమప్పా. ఏ ఫైల్ అయితే ఏంటి? నువ్వు పెట్టు నేను ఇస్తానని చెబుతా" అని అన్నారు.

ఇప్పుడే మూడో కూటమిపై వ్యాఖ్యానించడం సరికాదని, ఎన్నికలు దగ్గరకు వచ్చిన సమయంలో తమకు అనుకూలంగా ఉండే పార్టీలతో జతకట్టే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఒకే అబద్ధాన్ని తనకు అనుకూలమైన మీడియా ద్వారా పదేపదే చెప్పించి, దాన్ని నిజం చేయించే గోబెల్స్ సిద్ధాంతాన్ని ఇప్పుడు చంద్రబాబు పాటిస్తున్నాడని ఎద్దేవా చేశారు. అవతలి వ్యక్తి ఏం చేస్తున్నా బండలేస్తూ, బురద జల్లుతూ ప్రచారం సాగించే వ్యక్తి ఆయనని అన్నారు. నాలుగేళ్లుగా అడ్డగోలు అవినీతి చేస్తున్న సీఎం చంద్రబాబని నిప్పులు చెరిగారు. తన అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన ఏకైక సీఎం ఆయనేనని జగన్ అన్నారు.

More Telugu News