Jagan: ఈ మనిషి అసలు ముఖ్యమంత్రేనా?: జగన్ నిప్పులు

  • 14వ ఆర్థిక సంఘం హోదా వద్దని ఎన్నడూ చెప్పలేదు
  • కేంద్రం మభ్యపెడుతుంటే అంటకాగిన టీడీపీ
  • ఎన్నికల సంవత్సరం కాబట్టే కొత్త డ్రామా
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్

14వ ఆర్థిక సంఘం అసలు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా వద్దని ఎన్నడూ చెప్పలేదని, అయినప్పటికీ దాని పేరును చెబుతూ కేంద్రం మభ్యపెడుతుంటే, నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో అంటకాగి, ఎన్నికల సంవత్సరంలో ప్రజలను మోసం చేసేందుకు కేంద్రం నుంచి మంత్రులు తప్పుకుంటారని, తమ పార్టీ మాత్రం ఎన్డీఏలోనే ఉంటుందని చెప్పే చంద్రబాబునాయుడు అసలు ముఖ్యమంత్రేనా? అని వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు.

ఎవరైనా బాధ్యతగల స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం న్యాయమేనా? చంద్రబాబునాయుడు ఇప్పుడు చేసిన పని, అరుణ్ జైట్లీ స్టేట్ మెంట్ ఇచ్చిన అదే రోజు చేసుంటే ప్రత్యేక హోదా ఈ పాటికి వచ్చుండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టే చంద్రబాబు కొత్త డ్రామాకు తెరదీశారని ఎద్దేవా చేశారు. కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి, అక్కడి నుంచి కూడా పలు రకాల డిమాండ్లు వస్తాయన్న ఆలోచనతో కేంద్రం ఇప్పుడు హోదాపై తాత్సారం చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

 కేంద్రం చేస్తున్న పద్ధతి సరైనది కాదని, రాష్ట్రాన్ని విడగొట్టే వేళ వీరంతా అక్కడే ఉన్నారని, హోదాను ఇస్తామని చెప్పి విడగొట్టారని గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాల ఎంపీల ముందు హోదా ఇస్తామని చెప్పి విడగొట్టిన రెండు ప్రధాన పార్టీల్లో ఒకటి ఇప్పుడు అధికారంలో ఉందని, తామిచ్చిన హామీనే నెరవేర్చలేకుంటే ప్రజల్లో విశ్వసనీయతను ఎలా పెంచుకోగలరని ప్రశ్నించారు.

More Telugu News