blackberry: ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, వాట్సాప్ లపై కోర్టుకెక్కిన బ్లాక్ బెర్రీ

  • ఫేస్ బుక్, దాని సంస్థలు రూపొందించిన యాప్స్ పై అభ్యంతరాలు 
  • తమ పేటెంట్ హక్కులను ఉల్లంఘించాయని ఆరోపణ
  • నష్ట పరిహారం కోసం డిమాండ్

ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లపై మొబైల్స్ తయారీ సంస్థ బ్లాక్ బెర్రీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ పేటెంట్లను ఉల్లంఘించినట్టు ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగా పేటెంట్లను ఉల్లంఘించినందుకు గాను నష్ట పరిహారం చెల్లించాలని కోరింది.

‘‘ఫేస్ బుక్, దాని పిల్ల కంపెనీలు పలు మెస్సేజింగ్ యాప్ లను రూపొందించాయి. భద్రత, యూజర్ ఇంటర్ ఫేజ్ ఫీచర్స్, బ్యాటరీ ఎఫీషియెంట్ స్టాటస్ అప్ డేట్స్ తదితర అంశాల్లో బ్లాక్ బెర్రీ మేధో హక్కులను (పేటెంట్ రైట్స్) ఉల్లఘించాయి. దీనిపై ఫేస్ బుక్ తో ఎన్నో ఏళ్లుగా చర్చించడం జరిగింది. చివరికి వాటాదారుల కోణంలో తగిన న్యాయపరమైన చర్యలు చేపట్టాం’’ అని బ్లాక్ బెర్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ రెండూ కూడా ఫేస్ బుక్ కు చెందినవే. వాటిని ఉద్దేశించే బ్లాక్ బెర్రీ పిల్ల కంపెనీలని వ్యాఖ్యానించింది.

More Telugu News