flipkart: పోగొట్టుకున్న చోటే వెతుక్కునే కార్యక్రమం... పట్టణ వాసులపై ఫ్లిప్ కార్ట్ ఫోకస్

  • దేశంలో నంబర్ 1 అయినా పట్టణాల్లో మాత్రం వెనుకంజ
  • వేగవంతమైన డెలివరీతో దూసుకుపోతున్న అమేజాన్
  • ఇకపై తానూ ఇదే విధంగా నడవాలని ఫ్లిప్ కార్ట్ నిర్ణయం
  • కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు

దేశంలో అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ పట్టణ వాసులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టింది. సాధారణంగా నగరాలు, పట్టణాల్లోని వారు ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. ఆన్ లైన్ షాపింగ్ లో వీరిదే గణనీయమైన వాటా. అమేజాన్ అదే రోజు డెలివరీ, మరుసటి రోజు డెలివరీ వంటి చర్యలు, ఆఫర్లతో పట్టణ వాసులకు దగ్గరైంది. కానీ, ఈ విషయంలో ఫ్లిప్ కార్ట్ ఇన్నాళ్లూ వెనుకబడింది. నగర, పట్టణ వాసులు అమేజాన్ ప్లాట్ ఫామ్ పై ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారు.

దీంతో ఫ్లిప్ కార్ట్ చికిత్సా చర్యలు మొదలు పెట్టింది. కోల్పోయిన చోటే తిరిగి కస్టమర్లను వెతుక్కునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయనుంది. ఆఫర్లతో కస్టమర్లకు గాలం వేయనుంది. ఫ్లిప్ కార్ట్ గతేడాది సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ.25,000 కోట్లకుపైగా) నిధులను జపాన్ సాఫ్ట్ బ్యాంకు, చైనా టెన్సెంట్ నుంచి సమీకరించింది. ఆ నిధులతో అమేజాన్ కు గట్టి పోటీనిచ్చే ప్రణాళికతో ఉంది. మెట్రోల్లో గడిచిన ఏడెనిమిది నెలల్లో 30-40 పాయింట్ల వృద్ధి సాధించామని, అక్కడ తాము బలంగా లేమని ఫ్లిప్ కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.

More Telugu News