Yanamala: ఏదో ఒకటి ఇస్తే వద్దే వద్దు... అడిగినది ఇవ్వాల్సిందే: తేల్చి చెప్పిన యనమల

  • ప్రజల మనోభావాలను ఖాతరు చేయడం లేదు
  • సమస్యను పరిష్కరించే ఆలోచనలో లేని కేంద్రం
  • మీడియాతో చిట్ చాట్ లో యనమల

ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను కేంద్రం ఎంతమాత్రమూ ఖాతరు చేయడం లేదని, రాష్ట్రంలో ఎంతగా ఆందోళనలు జరుగుతున్నా, చర్చించి, సమస్యను పరిష్కరించాలన్న కనీస ఆలోచన కేంద్రంలో కనిపించడం లేదని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం వెలగపూడిలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, తాము ప్రధానంగా మూడు డిమాండ్లను ప్రస్తావిస్తున్నామని, వాటిల్లో ఒక్కటి కూడా కేంద్రం ఆలోచించడం లేదని ఆరోపించారు.

ప్రత్యేక హోదా తమ తొలి డిమాండని చెప్పిన ఆయన, హోదా కుదరదని గతంలో అన్నారు కాబట్టే ప్యాకేజీకి అప్పట్లో ఒప్పుకున్నామని అన్నారు. కనీసం 2017 నీతి ఆయోగ్ నిబంధనల ప్రకారం ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ లను పొందుతున్న 11 రాష్ట్రాల జాబితాలో ఏపీని చేర్చాలని కోరితే, చూస్తాం, చేస్తామని చెబుతూ వచ్చి, ఇప్పుడు తెలుగు ప్రజల సెంటిమెంట్, తమిళుల సెంటిమెంట్ అని కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు. ఆర్థిక లోటు భర్తీపై ప్రశ్నించినా సమాధానం రాలేదని అన్నారు. కేంద్రం ఏదో ఒకటి ఇస్తే తీసుకునే పరిస్థితి లేదని, తాము అడుగుతున్నదే ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు.

More Telugu News