Holi: నేను హిందువును... రంజాన్ ఎందుకు చేసుకోవాలి?: యోగి ఆదిత్యనాథ్ మరో వివాదాస్పద వ్యాఖ్య

  • ఇటీవల హోలీ, నమాజ్ ను పోల్చిన ఆదిత్యనాథ్
  • మరోసారి కలకలం రేపే వ్యాఖ్యలు
  • హిందువుగా ఉన్న తాను ఈద్ జరుపుకోబోనన్న యోగి
  • అసెంబ్లీ వేదికగా ప్రసంగం

హోలీ సంవత్సరానికి ఒక్కసారే వస్తుందని, నమాజ్ నిత్యమూ వస్తుందని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకున్నారు. తానో హిందువునని, రంజాన్ పండగను ఎందుకు జరుపుకోవాలని ఆయన ప్రశ్నించారు. యూపీ అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు విపక్ష సమాజ్ వాదీ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన ఆయన, "నేను హిందువును. ఈద్ జరుపుకోను. అసలు రంజాన్ ను నేనెందుకు జరుపుకోవాలి? నా మతం నాకు గర్వకారణం. నేను వారిలా మత విశ్వాసాలతో ఆడుకునే వ్యక్తిని కాదు. ఓ వైపు గుడిలో కాశీదారాలు కట్టించుకుని, మరోవైపు నెత్తిన టోపీ పెట్టుకుని, ఇంకోవైపు మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు చేయను, చేయబోను" అని అన్నారు. త్రిపురలో ఎన్డీయే కూటమి విజయాన్ని ప్రస్తావిస్తూ, ఆ రాష్ట్రం పాతికేళ్ల వామపక్ష పాలనకు చరమగీతం పాడిందని అన్నారు.

More Telugu News