sharwanand: శర్వానంద్ మూవీ నుంచి ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్

  • హను రాఘవపూడితో శర్వానంద్
  • కథానాయికగా సాయిపల్లవి 
  • వేసవిలో రిలీజ్ చేయాలనే ఆలోచన  

చకచకా వరుస సినిమాలు చేసేయాలనే తొందర శర్వానంద్ లో మనకి కనిపించదు. ఆలస్యమైనా ఫరవాలేదు కొత్తదనంతో కూడిన కథలను చేయడానికే ఆయన ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. ఆయన అనుసరిస్తోన్న ఈ పద్ధతి కారణంగానే వరుస విజయాలు వచ్చి ఆయన ఖాతాలో చేరుతున్నాయి. తాజాగా ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకి 'పడి పడి లేచే మనసు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఓ సాధారణమైన యువకుడిగా డిఫరెంట్ లుక్ తో ఈ పోస్టర్ లో శర్వానంద్ కనిపిస్తున్నాడు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది.   

More Telugu News