Road Accident: అతి వేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను ఢీ కొన్న కారు.. సురక్షితంగా బయటపడిన డ్రైవర్

  • గుజరాత్‌లో ఘటన
  • సినిమా సీన్‌ను తలపించేలా దూసుకొచ్చిన కారు
  • రోడ్డుపై ఎవ్వరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం

అతివేగం ప్రమాద‌క‌ర‌మ‌ని ఎంత‌గా ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ వాహ‌న‌దారులు మాత్రం నిర్ల‌క్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. తాజాగా గుజ‌రాత్‌లోని మోర్బీ ప్రాంతంలో ఓ వ్యక్తి అతి వేగంగా కారు నడిపి కంట్రోల్ తప్పి డివైడర్‌ను ఢీ కొట్టాడు. అతడు బ్రేక్ వేయాలని ఎంతగా ప్రయత్నించినా కారు కంట్రోల్ కాలేదు. అంతేగాక, కారు ఆ రోడ్డుపై వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీ కొన్న దృశ్యాలు సినిమా సీన్లను తలపించేలా ఉన్నాయి.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ ప్రమాదం జరుగుతోన్న సమయంలో ఆ రోడ్డుపై ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ కారు డ్రైవర్ కూడా స్వల్ప గాయాలతోనే కారులోంచి బయటకు వచ్చాడు. 

More Telugu News