sharwanand: శర్వానంద్ సినిమాకి టైటిల్ ను ఖరారు చేసేశారు

  • హను రాఘవపూడితో శర్వానంద్ 
  • ఆయన సరసన సాయిపల్లవి 
  • 'పడి పడి లేచే మనసు' టైటిల్ ఖరారు

హను రాఘవపూడి పేరు వినగానే విభిన్నమైన కథా చిత్రాలు కనులముందు కదలాడతాయి. ఇక శర్వానంద్ పేరు వినగానే ఆయన పోషించిన విలక్షణమైన పాత్రలు కనిపిస్తాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో త్వరలో ఒక సినిమా రూపొందనుంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగుకి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. కథ ప్రకారం ఈ సినిమాకి 'పడి పడి లేచే మనసు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.

 అదే టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. రేపు ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్ ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకూ తాను పోషించిన పాత్రలకి భిన్నంగా .. ఆర్మీ ఆఫీసర్ గా శర్వానంద్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. 'ఫిదా' .. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాలతో హిట్ కొట్టిన సాయి పల్లవి, ఈ సినిమాలో శర్వానంద్ తో జోడీ కడుతోంది. క్రేజీ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతుండటంతో, అందరిలోనూ ఆత్రుత పెరుగుతూ వస్తోంది.   

More Telugu News