devid warner: సహచరులు ఆపుతున్నా ఆగని వార్నర్... డికాక్ తో మాటల యుద్ధం.. వీడియో చూడండి

  • తొలి టెస్టు మూడో రోజు నిలదొక్కుకున్న క్వింటన్ డీకాక్
  • డీకాక్ ను దూషించిన వార్నర్
  • సహచరులు అడ్డుకుంటున్నా పట్టించుకోని వార్నర్

క్రికెట్‌ లో స్లెడ్జింగ్ ఒక భాగమని ఆటగాళ్లంతా అంగీకరిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే స్లెడ్జింగ్ ఆస్ట్రేలియన్లకు తెలిసినంత బాగా ఏ జట్టుకీ తెలియదన్న విషయాన్ని కూడా అంతా ఒప్పుకుంటారు. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేయన్ల మాటలయుద్ధం శ్రుతిమించింది. మైదానం వరకు పరిమితమైన స్లెడ్జింగ్ మైదానం వెలుపల కూడా కొనసాగడం ఆందోళన రేపుతోంది. డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో  351 పరుగులు చేసింది దానికి సమాధానంగా సఫారీలు 162 పరుగులకే బొక్కబోర్లాపడ్డారు.

ఫాలోఆన్ ఇవ్వని ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 227 పరుగులు చేసింది. సమాధానంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ప్రోటీస్ 9 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేశారు. క్రీజులో డీకాక్ (81)కి జతగా, మోర్నీ మోర్కెల్ బ్యాటింగ్ కు దిగాడు. ఈ సమయంలో మూడోరోజు ఆటముగిసింది. దీంతో మైదానం వీడిన ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ కి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ముందుగా ఆసీస్‌ ఆటగాళ్లు మెట్లు ఎక్కుతున్నారు.

వారి వెనుక క్రీజులో బ్యాటింగ్‌ చేసిన డీకాక్‌ వస్తున్నాడు. మెట్లు ఎక్కుతూ డీకాక్‌ పై డేవిడ్ వార్నర్ విరుచుకుపడ్డాడు. సహచర ఆటగాళ్లు వద్దు వద్దు అని వారిస్తున్నా వార్నర్‌ పట్టించుకోలేదు. దీంతో స్మిత్ వచ్చి వార్నర్ ను డ్రస్సింగ్ రూమ్‌ లోకి బలవంతంగా తీసుకెళ్లాడు. ఇదంతా డ్రెస్సింగ్ రూం మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియోను బయటపడడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణకు ఆదేశించింది.  

More Telugu News