eesha rebba: వెంకటేశ్ మూవీలో మరో యంగ్ హీరోయిన్

  • తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేట నాదే'
  • వెంకీ సరసన శ్రియ 
  • నారా రోహిత్ జోడీగా ఈషా రెబ్బా

తేజ దర్శకత్వంలో వెంకటేశ్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'ఆట నాదే వేట నాదే' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన కథానాయికగా శ్రియను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నారా రోహిత్ నటిస్తున్నాడు. ఆయన జోడీగా ఈషా రెబ్బను తీసుకున్నారు.

 'అమీ తుమీ'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బా .. ఇటీవల వచ్చిన 'అ!' సినిమాతో మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. యూత్ హృదయాలను దోచేస్తూ ఉండటంతో .. ఈ సుందరిని వరుస అవకాశాలు వరిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలోనూ ఛాన్స్ పట్టేసింది. చూస్తుంటే ఈషా రెబ్బా మిగతా హీరోయిన్లకి గట్టిపోటీ ఇచ్చేట్టుగానే కనిపిస్తోంది.   

More Telugu News