Hansika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • నిఖిల్ సినిమాలో నాయికగా హన్సిక!
  •  నితిన్ 'శ్రీనివాస కల్యాణం' మొదలైంది 
  • రానా 'టైగర్ నాగేశ్వరరావు' సంగతులు
  • ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్రలో లయ?  

*  యంగ్ హీరో నిఖిల్ సరసన బబ్లీ హీరోయిన్ హన్సిక నాయికగా నటించనున్నట్టు సమాచారం. నిఖిల్ హీరోగా సంతోష్ దర్శకత్వంలో తమిళ హిట్ చిత్రం 'కనితన్'ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఇందులో కథానాయికగా హన్సికను తీసుకుంటున్నారట.
*  నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందే 'శ్రీనివాస కల్యాణం' చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో ప్రారంభమైంది. రాశీఖన్నా, నందితా శ్వేత ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూలు ఈ నెల 16 నుంచి నెలాఖరు వరకు జరుగుతుంది.
*  రానా హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందే 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. స్టువార్టుపురంకు చెందిన పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కనుంది.
*  ఒకప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలలో నాయికగా నటించిన లయ చాలా కాలం తర్వాత మళ్లీ నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించే చిత్రంలో లయ ఓ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.  

More Telugu News