Amitabh Bachchan: అప్పుడు, మహాత్మా గాంధీ నుంచి మా నాన్నకు పిలుపు వచ్చింది: అమితాబ్ బచ్చన్

  • తన తండ్రి రాసిన నవల ‘మధుశాల’ను ప్రస్తావించిన అమితాబ్
  • యువతను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ నాడు ఆందోళనలు జరిగాయి
  • ఈ వ్యవహారం మహాత్మాగాంధీ వద్దకు వెళ్లింది : అమితాబ్

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ తాజాగా ఓ జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు.1933లో తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ రాసిన నవల ‘మధుశాల’ గురించి అమితాబ్ తన ట్వీట్ లో ప్రస్తావించారు. ఈ నవలలో యువతను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయంటూ తన తండ్రిని అరెస్టు చేయాలంటూ నాడు జరిగిన సంఘటనను అమితాబ్ గుర్తుచేసుకున్నారు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఈ నవల ఉందంటూ, ఆయన్ని అరెస్టు చేయాలంటూ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో నాడు ఆందోళనలు చేశారని చెప్పారు.

ఈ విషయమై మహాత్మాగాంధీకి కూడా ఫిర్యాదు చేశారని, దీంతో, తన తండ్రిని రమ్మంటూ గాంధీ నుంచి పిలుపు వచ్చిందని చెప్పారు. ఆ నవలలో ఏముందో తాను వినాలనుకుంటున్నానని గాంధీ వద్దకు వెళ్లిన తన తండ్రితో మహాత్ముడు అన్నారని చెప్పారు. ఆ నవలలో ఉన్న కొన్ని వ్యాఖ్యలు, పద్యాలను చదివి వినిపించగా, వాటిని విన్న గాంధీజీ, వీటిలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో తన తండ్రి ఊపిరి పీల్చుకున్నారని,  ఆ విధంగా ఆందోళనకారుల నుంచి తన తండ్రిని గాంధీజీ కాపాడారని ఆ ట్వీట్ లో అమితాబ్ గుర్తుచేసుకున్నారు.

More Telugu News